త్రివిక్ర‌మ్ భార్య డాన్స్‌ చూసారా.. ఆమె ఎంత పెద్ద క్లాసిక‌ల్ డాన్స‌రో తెలుసా!

టాలీవుడ్‌ డైరెక్టర్‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కు ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఆయ‌న ఇంట్లో మ‌రో టాలెంట్ కూడా ఉంది. అదే ఆయ‌న స‌తీమ‌ణి సౌజ‌న్య‌. ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత‌, ప‌ద్మ‌శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సోద‌రుడు కూతురు ఈమె. త్రివిక్ర‌మ్ భార్య‌కు ఓ టాలెంట్ ఉంది. ఆమె అద్భుత‌మైన క్లాసిక‌ల్ డాన్స‌ర్. పెళ్లికి ముందు చాలా స్టేజ్ ప‌ర్ఫార్మెన్సులు ఇచ్చినా కూడా ఆ త‌ర్వాత బ‌య‌టికి రాలేదు. పెళ్లి త‌ర్వాత పూర్తిగా ఇంటికి ప‌రిమిత‌మైపోయిన సౌజ‌న్య‌.. తాజాగా మ‌రోసారి త‌న క‌ళ‌ను చూపించారు.

తాజాగా వైజాగ్‌లో జరిగిన కార్య‌క్ర‌మంలో త‌న క్లాసికల్ డాన్స్‌తో అంద‌ర్నీ మాయ చేసారు. ఆ డాన్స్ చూడ్డానికి వ‌చ్చిన వాళ్లంతా కూడా త్రివిక్ర‌మ్ భార్య అని తెలుసుకుని షాక్ అయ్యారు. ఎప్పుడూ బ‌య‌టికి రాని సౌజ‌న్య‌.. ఇప్పుడిలా ఒక్క‌సారిగా బ‌య‌టికి వ‌చ్చి డాన్సులు చేసేస‌రికి అంతా మాయ‌లో ఉండిపోయారు. గ‌తేడాది ర‌వీంద్ర భార‌తిలో కూడా ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ ఎదురుగా సౌజన్య నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. ఇప్పుడు కూడా మ‌రోసారి త‌న నాట్యంతో అంద‌ర్నీ మాయ చేసారు సౌజ‌న్య‌. భార్య‌కు వ‌స్తున్న పేరు చూసి త్రివిక్ర‌మ్ కూడా మ‌న‌సులో మౌనంగా మురిసిపోతున్నాడు.