ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని మోతీనగర్‌ రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కేజ్రీవాల్‌ ఉన్న ప్రచార రథంపైకి ఎక్కి పరుష పదజాలంతో దూషిస్తూ.. చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనతో అవాక్కయిన కేజ్రీవాల్‌ వాహనంలో వెనక్కి జరిగి దుండగుడి దాడి నుంచి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆప్‌ కార్యకర్తలు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు.