చిరూస్ ఫిల్టర్ కాఫీ!

మెగా స్టార్ చిరంజీవి కోడలు ఉపాసన లేటెస్ట్ గా చిరంజీవి పేరును వాడుకుంటూ ఏర్పాటు చేసిన ‘కాఫీ షాప్’ న్యూస్ మెగా అభిమానుల మధ్య సంచలనంగా మారింది. ‘ధియేటర్ కేఫ్’ పేరుతో తన మామయ్య చిరంజీవి పేరుతో స్పెషల్ డ్రింక్ ను సృష్టించడమే కాకుండా ‘చిరూస్ ఫిల్టర్ కాఫీ’ పేరుతో ఒక కాఫీ బ్రాండ్ ను కూడ క్రియేట్ చేసింది ఉపాసన. ఈరోజు శుక్రువారం మధ్యాహ్నం ఈ కాఫీ షాప్ ను ప్రారంభించారు.

జూబ్లీహిల్స్ లోని అపోలో ఫౌండేషన్ థియేటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కాఫీ షాపులో సామాన్యుడుకి కూడా అందుబాటులో ఉండే రేట్లకు హైదరాబాదీ కేసర్ రోజ్ టీ – లుఖ్మి చికెన్/వెజ్ – లమాకాన్స్ వరల్డ్ ఫేమస్ సమోసా – మిర్చి బజ్జి లభించనున్నాయి. తాను కొత్తగా ప్రారంభించిన ఈ కాఫీ కేఫ్ కు వచ్చి రిలాక్స్ అవ్వండి అంటూ ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. 

CLICK HERE!! For the aha Latest Updates