ట్రెండింగ్‌లో ఉప్పెన ‘జలజలజలపాతం’ వీడియో సాంగ్‌

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌-కృతిశెట్టి హీరో,హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాక వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాపై పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి గురువారం సాయంత్రం జలజలజలపాతం నువ్వే.. వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయాఘోషల్‌, జాస్‌ప్రీత్‌ జాజ్‌ మనోహరంగా ఆలపించారు. అప్పట్లో కేవలం లిరికల్‌ సాంగ్‌ను మాత్రమే రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ తాజాగా ఈ మెలోడి పూర్తి వీడియోను విడుదల చేసింది. ఇది 39 లక్షల పై చిలుకు వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates