
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. పదకొండేళ్ల క్రితం వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరు జతకట్టడంతో ఆసక్తినెలకొంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ మరోసారి ఖాకీ డ్రెస్సులో సందడి చేయనున్నారు. ఏప్రిల్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించినుంది. ఈ విషయాన్ని చెబుతూ నిర్మాణ సంస్థ ట్విట్టర్ లో అప్‌డేట్ ఇచ్చింది. ‘మరోసారి చరిత్రను తిరగరాద్దాం’ అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టిల్స్‌ను పంచుకుంది. పవన్ – హరీశ్ మధ్య అనుబంధాన్ని చెప్పేలా ఈ ఫొటోలు ఉన్నాయి. ‘కొన్ని విషయాలు, అనుబంధాలు ఎప్పటికీ మారవు’ నిర్మాణ సంస్థ క్యాఫ్షన్ ఇచ్చిన ఈ ఫొటోలు నెట్ లో వైరల్ గా మారాయి. కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుందని, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ఓ భారీ సెట్‌ను సిద్థం చేస్తున్నామని తెలిపింది.
త్వరలోనే ఆ సెట్‌లో పవన్‌కల్యాణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామని వెల్లడించింది. ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు.













