‘వకీల్‌ సాబ్‌’ న్యూ అప్‌డేట్‌


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘సత్యమేవ జయతే’ అనే పాటని మార్చి 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌. వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతోంది. శృతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పవన్‌ తొలిసారి లాయర్‌ పాత్ర నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’ పాటకు భారీ స్పందన వచ్చింది. ఏప్రిల్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates