‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో రోజా లేదు: వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. లక్ష్మి పార్వతి.. ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే అంశాలతో సినిమా నడుస్తుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని తేల్చేశాడు వర్మ. ఇక ఈరోజు లక్ష్మీపార్వతి పాత్రలో రోజా కనిపించనుందనే ప్రచారం ఊపందుకుంది.
సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో వర్మ తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా ఈ విషయంపై స్పందించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో రోజా నటిస్తుందనే వార్తలు నిరాధారమని, అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ అంశం చుట్టూ మీడియా వార్తలు తిరుగుతుండటాన్ని ప్రస్తావించారు. మరి ఎన్టీఆర్, లక్ష్మిపార్వతీల పాత్రల్లో దక్షిణాది తారలను ఎంపిక చేసుకుంటారా..? లేక బాలీవుడ్ నుండి ఆర్టిస్టులను రంగంలోకి దింపుతారా..? అనే విషయాల్లో క్లారిటీ రావాల్సివుంది.