దీపావళికి రానున్న ‘గని’

మెగా ఫ్రీన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని అల్లు బాబీ , సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లినప్పటికీ, పక్కా ప్లానింగుతో షూటింగు కొనసాగుతోంది. ఇప్పటికే చాలావరకూ షూటింగు పూరైంది. ఇక ఈ సినిమాను దీపావళికి థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. బాక్సర్ ‘గని’ పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంతగా కసరత్తు చేశాడనేది ఈ పోస్టర్ ను చూస్తే అర్థమైపోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. కీలకమైన పాత్రల్లో సునీల్ శెట్టి, ఉపేంద్ర కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. వరుస హిట్లతో ఉన్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా మరింత ఊపునిస్తుందేమో చూడాలి. ఇక వరుణ్ తేజ్ చేసిన ‘ఎఫ్ 3’ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates