HomeTelugu Trendingవరుణ్ తేజ్ 'గని'పై నిర్మాతల ప్రకటన

వరుణ్ తేజ్ ‘గని’పై నిర్మాతల ప్రకటన

gani movie release date
సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాలు కరోనా థర్డ్‌వేవ్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్కరుగా తమ చిత్రాలను విడుదల చేసేందుకు ముందుకొస్తున్నారు. ఏదో ఒక రోజు విడుదల చేయొచ్చనే ఆలోచనలో రెండేసి తేదీలను ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే కరోనా పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేము కదా. ప్రకటించిన రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేయొచ్చనే ఉద్దేశంతో ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్మాతలు.

ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ RRR విడుదల తేదీ ప్రకటించడంతో నెమ్మదిగా మిగతా చిత్రాల నిర్మాతలు సైతం తమ చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.

కరోనా ఆంక్షలు సడలించిన వెంటనే థియేటర్‌లో సినిమా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. కరోనా ఆంక్షల కారణంగా వాయిదా వేశారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు బరిలో ఉండటంతో గని చిత్ర నిర్మాతలు వెనక్కి తగ్గారు.

గని చిత్రంలో బాక్సింగ్ ప్రొఫెషనల్‌గా కనిపించాలనే ఉద్దేశంతో సిక్స్ ప్యాక్ సిద్ధం చేసుకున్నాడు. బాక్సింగ్‌పై అమెరికాలో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్, వ్లాడ్ రింబర్గ్ పనిచేశారు. వరుణ్ సరసన సయి ముంజ్రేకర్ నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!