వేగం పెంచిన వరుణ్‌ తేజ్‌.. బ్రేకుల్లేవ్ !

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ చాలా వేగంగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ‘అంతరిక్షం’ఆ నే సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సినిమా చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమాలు పూర్తికాక ముందే మరొక మూవీకు సైన్ చేస్తూ రాబోయే రెండేళ్లకు సరిపడే విధంగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు వరుణ్‌.

ఇవే కాక మరో మూడు ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒక చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా ఇంకొక చిత్రాన్ని ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ డీల్ చేయనున్నాడు. ఇక మూడవ సినిమాను ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి డిఫరెంట్ సినిమాను తీసిన సాగర్ చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు.