HomeTelugu News15లోగా..15 అంతస్థుల కరోనా ఆస్పత్రి సిద్ధం

15లోగా..15 అంతస్థుల కరోనా ఆస్పత్రి సిద్ధం

4 6
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా బాధితుల కోసం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు.

గచ్చిబౌలిలో స్పోర్ట్స్‌ అథారిటీకి సబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రి పనులను ఇవాళ పరిశీలించారు. దాదాపు 15 అంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో ఆసుపత్రి ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ భవనంలో పనులు పూర్తయితే దాదాపు 1500 పడకలు ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి రానుంది. రోజుకు దాదాపు వెయ్యి మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 364 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 15లోగా ఆసుపత్రిని సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu