
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈరోజు ఉదయ కరోనా బారినపడినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్ట్ చేసుకోవాలని కోరారు. అయితే చరణ్ అనంతరం ప్రస్తుతం మరో మెగా హీరో కరోనా బారిన పడ్డారు. వరుణ్ తేజ్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.ఈ రోజు ఉదయం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్దిగా లక్షణాలు ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే తిరిగి వస్తాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞుడిని’. అని ఓ నోట్ విడుదల చేశారు. మెగా హీరోలిద్దరూ కరోనా సోకడంతో అభిమానులు #Get Well Soon అనే హ్యష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా నాలుగు రోజుల క్రితమే రామ్ చరణ్, వరుణ్‌తేజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్టమస్ జరుపుకున్నారు. ఇప్పుడు వీరంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చరణ్, వరుణ్‌కు పాజిటివ్‌గా తేలడంతో మెగా కుటుంబంలో టెన్షన్ మొదలైంది.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 29, 2020













