బాక్సర్‌గా వరుణ్‌..?

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్ తాజాగా అంతరిక్షం సినిమాతో ఆకట్టుకున్నాడు.. కాగా తదుపరి చిత్రంలోనే ప్రయోగానికే రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ‘ఎఫ్‌ 2’లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న ఈ యంగ్‌ హీరో తరువాత ఓ స్పోర్ట్స్‌ డ్రామాలో నటించేందుకు అంగీకరించాడంట. కొత్త దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాతో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడట.

ఈ సినిమాను అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సీనియర్‌ హీరో వెంకటేష్‌తో కలిసి వరుణ్‌ నటిస్తున్న ఎఫ్‌ 2 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌కు జోడిగా మెహరీన్‌ నటిస్తోంది.