అభిమాని ఆకాంక్షను నెరవెర్చిన వెంకటేశ్‌

స్టార్‌ హీరో విక్టరీ వెంకటేశ్‌ తన అభిమాని ఆకాంక్షను నెరవేర్చారు. ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్న సురేశ్‌ అనే అభిమానిని కలిసి, కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. సురేశ్‌ నివాసంలో వెంకటేశ్‌ ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెంకీ మంచి మనసును నెటిజన్లు మెచ్చుకున్నారు.

వెంకటేశ్‌ ఇటీవల ‘f2’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ మరో హీరోగా నటించారు. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్‌లు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ నటన హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన ‘వెంకీమామ’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నాగచైతన్య రెండో హీరోగా నటిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.‌