HomeTelugu Trendingదృశ్యం-2పై వెంకటేష్‌ అభిప్రాయం ఇదేనట!

దృశ్యం-2పై వెంకటేష్‌ అభిప్రాయం ఇదేనట!

Venkateshs opinion on Drus

విక్టరీ వెంకటేష్‌ నటించిన తాజా సినిమాలు ‘నారప్ప’, ‘దృశ్యం 2’. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన ‘అసురన్’ సినిమాని తెలుగులో ‘నారప్ప’ టైటిల్ తో రూపొందించారు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక మలయాళంలో మోహన్ లాల్ చేసిన ‘దృశ్యం 2’ రీమేక్ ను ఆ టైటిల్ తోనే రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీ ద్వారా ‘దృశ్యం 2’ సినిమాను రిలీజ్ చేసి, థియేటర్లు ఓపెన్‌ అయిన తరువాత ‘నారప్ప’ను రిలీజ్ చేస్తే బాగుంటుందనే వెంకటేష్‌ అభిప్రాయ పడుతున్నరట. మరి దీనిపై సురేశ్ బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!