మహేష్‌బాబు పుట్టుకతోనే సూపర్‌స్టార్‌: వర్మ

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు పుట్టుకతోనే సూపర్‌స్టార్‌ అని ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. మహేష్ బాలనటుడిగా చేసిన ఓ సినిమాలోని సన్నివేశం వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో మహేష్‌ నటనను మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. ‘యాటిట్యూడ్‌తో క్యూట్‌నెస్‌ మిక్స్‌ అయిపోయింది. వాటితో ఆత్మస్థైర్యం కలిసింది. మహేష్‌ బాబు నిజంగా పుట్టుకతోనే సూపర్‌స్టార్‌’ అని వర్మ పేర్కొన్నారు. ఈ వీడియోకు నెటిజన్ల విశేష స్పందన వస్తోంది. ‘మహేష్‌తో ఓ సినిమా తీయండి’ అని కామెంట్లు చేశారు. వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. అనేక వివాదాలు ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పటికే తెలంగాణలో విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్రాన్ని విడుదల చేశారు. రాకేష్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.