ఆసక్తికరంగా ‘వెంకీమామ’ ట్రైలర్‌


అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య, విక్టరీ వెంకటేష్‌‌ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘వెంకీమామ’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని మీ నమ్మకం. ఆ రాతను తిరిగిరాసే శక్తి మనిషికి ఉందని నా నమ్మకం’ అనే వెంకటేష్ డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. అలాగే ..నీ నుంచి నన్ను ఎవరు విడదీయలేరు మామయ్య. అది నీవల్ల కూడా కాదు.’ అంటూ.. నాగచైతన్య చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్‌ కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించేలా ఉంది. అలాగే జవాన్‌ పాత్రలో చైతన్య ఆకట్టుకున్నాడు. ‘ఈసారి జాతర్ని రంగుల్తో కాదు.. మీ రక్తంతో ఎరుపెక్కిస్తా.’ అని వెంకటేష్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగులు ప్రేక్షకులతో ఈలలు వేపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates