
స్టార్ హీరో కమల్ హాసన్ విక్రమ్ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో శంకర్ ‘ఇండియన్ 2’ని మళ్లీ పట్టాలెక్కించాడు. 1996లో విడుదలై తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సంచలనం సృష్టించింది ‘ఇండియన్’. ఈ మూవీకి సీక్వెల్ గా ఇండియన్-2 ని తెరకెక్కిస్తున్నారు.
ఈ షూటింగ్ సెట్ లో క్రేన్ విరిగిపడటంతో నలుగురు సిబ్బంది అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఈ మూవీ షూటింగ్ విషయంలో లైకా ప్రొడక్షన్స్ వారికి శంకర్ కు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అవి తారా స్థాయికి చేరడంతో శంకర్ ఈ ప్రాజెక్ట్ ని మధ్యలోనే ఆపేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు కమల్ హాసన్ చొరవ వల్ల మళ్లీ ‘ఇండియన్ 2’ పట్టాలెక్కింది.
ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని, బాబీ సింహా, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. అక్కడ కమల్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా శంకర్ కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీలో వెన్నెల కిషోర్ పాత్ర గురించి ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ నెగటివ్ రోల్‌లో కనిపించబోతున్నాడట. ఇంత వరకు ఈ తరహా పాత్రలో కమెడియన్ వెన్నెల కిషోర్ కనిపించలేదని ప్రతీ ఒక్కరిని షాక్ కు గురి చేయడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













