
Kamal Haasan ThugLife Controversy:
తమిళ స్టార్ కమల్ హాసన్ మరియు డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న సినిమా “Thug Life” పైన భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. కమల్ హాసన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారు.
ఈ వ్యాఖ్యలపై కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటన చేసింది. కమల్ హాసన్ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే, “Thug Life” సినిమాను కర్ణాటకలో విడుదలనివ్వమంటూ హెచ్చరిక జారీ చేసింది. కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక రక్షణ వేదిక కూడా తీవ్రంగా స్పందించింది. సినిమా ప్రదర్శకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించకూడదని వార్నింగ్ ఇచ్చింది.
ఇదే సమయంలో కమల్ హాసన్ మాత్రం తాను చెప్పిన మాటలు తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పమన్న డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.
కమల్ హాసన్ ఇక కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు, సినిమా రిలీజ్‌కు మార్గం దొరకాలనే ఉద్దేశంతో. కానీ అక్కడ కూడా పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. ప్రాంతీయ హక్కులు, ప్రజా భావోద్వేగాలు దెబ్బతినినపుడు, ఆ ప్రాంతంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే.
కర్ణాటక ఓ ముఖ్యమైన సౌత్ ఇండియన్ మార్కెట్. అందులో సినిమా విడుదల ఆగిపోతే, కమర్షియల్‌గా భారీ నష్టాలు తప్పవు. పైగా కమల్ హాసన్ ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో, ఆర్థికంగా ఇది డెబ్బతినే అవకాశముంది.
కర్ణాటక ఫిలిం చాంబర్ చివరిసారి 24 గంటల టైమ్ ఇచ్చింది. కమల్ క్షమాపణ చెప్పకపోతే, సినిమా విడుదల కష్టమే. ఇప్పుడు కమల్ మెలో చేస్తారా? లేదంటే నిలబడతారా? అన్నది చూడాలి.