
Kamal Haasan Assets:
ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. నామినేషన్ సమయంలో ఆయన ప్రకటించిన ఆస్తుల విలువలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తం రూ.305.55 కోట్లు విలువైన ఆస్తులున్నాయని కమల్ హాసన్ వెల్లడించారు.
ఈ మొత్తం ఆస్తుల్లో రూ.245.86 కోట్లు అమూవబుల్ ప్రాపర్టీస్ (భూములు, బిల్డింగులు) కాగా, రూ.59.69 కోట్లు మూవబుల్ అసెట్స్ (కార్లు, నగదు, పెట్టుబడులు)గా ఉన్నాయి. కమల్ హాసన్ చెన్నైలో నాలుగు కమర్షియల్ ప్రాపర్టీలు కలిగి ఉన్నారు. వాటి విలువ ఒక్కటే రూ.111.1 కోట్లు అని చెబుతున్నారు.
అలాగే అధిక విలువ ఉన్న వ్యవసాయ భూములు, వాటి విలువ రూ.22.24 కోట్లు అంటున్నారు. లగ్జరీ కార్ల జాబితా కూడా ఆయన వద్ద పెద్దదిగా ఉందని తెలుస్తోంది. అంతేకాదు, విదేశాల్లో, ముఖ్యంగా యూకేలో హైఎండ్ ప్రాపర్టీ ఉన్నట్లు సమాచారం.
ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే – ఆయన తన ప్రొఫెషన్‌ను “Artist”గా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌ను “Class 8”గా పేర్కొన్నారు. అంటే, ఓ ఎనిమిదో తరగతి చదువుకున్న వ్యక్తి ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించగలిగినట్టు స్పష్టమవుతోంది!
కమల్ హాసన్ దక్షిణ భారత సినిమాల్లో హైయెస్ట్ పేడ్ యాక్టర్స్లో ఒకరు. ప్రతి సినిమాలో ఆయన రూ.100 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇందులో భాగంగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ అనే ప్రొడక్షన్ హౌస్ ద్వారా కూడా భారీగా ఆదాయం సంపాదిస్తున్నారు.
ఇక రాజ్యసభకు ఎన్నికైతే కమల్ హాసన్ పొలిటికల్ కెరీర్ కొత్త మలుపు తిరగబోతుందన్న మాట. సినిమా రంగంలో టాప్‌లో నిలిచిన ఆయన, రాజకీయాల్లో ఎలా రాణిస్తారో చూడాల్సిందే!
ALSO READ: బాలీవుడ్ సీనియర్ హీరోలకి చెక్ పెడుతున్న Vicky Kaushal!