మహర్షి సినిమాపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

హీరో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు కుటుంబ సభ్యులతో కలిసి మహర్షి చిత్రాన్ని వీక్షించిన ఆయన చిత్ర యూనిట్‌‌కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారాయన. కుటుంబ సభ్యులతో కలిసి మహర్షి చిత్రాన్ని చూశామని గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రమని.. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా అని వెంకయ్యనాయుడు తన అభిప్రాయం తెలిపారు. మహర్షి చిత్రం గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రమని.. సహజమైన చక్కని నటన కనబరిచిన హీరో మహేష్ బాబు.. చక్కగా తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates