భారీ గ్రాఫిక్స్ తో వెంకీ సినిమా!

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మార్చిలో వచ్చిన ‘గురు’ సినిమాలో కనిపించారు. ఆ తరువాత ఇప్పటివరకు ఆయనే సినిమా సైన్ చేయలేదు. తాజాగా వెంకీ విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉన్న ఓ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఓ కొత్త దర్శకుడు వెంకటేష్ కు నిర్మాత సురేష్ బాబుకు కథ వినిపించారట. ఈ విషయాన్ని స్వయంగా సురేష్ బాబు వెల్లడించారు. ఆ కథ తమకు బాగా నచ్చిందని, యానిమల్ బేస్డ్ సినిమాగా తెరకెక్కనుందని అన్నారు. 
అంతేకాకుండా ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కథ, విజువల్ ఎఫెక్ట్స్ పై కసరత్తు జరుగుతోందని, ఈ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఇది ఇలా ఉండగా, తమిళంలో హిట్ అయిన విక్రమ్ వేద అనే సినిమా తెలుగు రీమేక్ లో రానా, వెంకటేష్ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.