HomeTelugu Newsబోనీ జీ కోసమే.. విద్యాబాలన్‌!

బోనీ జీ కోసమే.. విద్యాబాలన్‌!

12 9

అమితాబ్‌ బచ్చన్‌ ప్రత్యేక పాత్రలో నటించిన బాలీవుడ్‌ హిట్‌ మూవీ “పింక్”ను తమిళంలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఖాకి ఫేం హెచ్‌. వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రను తమిళ స్టార్‌ అజిత్ పోషిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ అతిథి పాత్ర చేయబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అది నిజమేనని తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో విద్యా బాలన్‌ చెప్పారు. నిజానికి రీమేక్‌లలో నటించడం తనకు ఇష్టం ఉండదని, అయినా చేస్తున్నానని అన్నారు.

“పింక్‌” ‌రీమేక్‌లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు.. ఇది చాలా చిన్న పాత్ర అయినా బోనీ కపూర్‌ కోసం ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఆయనే నాకు ఆఫర్‌ ఇచ్చారు. అతిథి పాత్ర ఉంది, చేస్తావా? అని అడిగారు.. చేస్తానని చెప్పా. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది.. కేవలం బోనీ కపూర్‌ కోసమే చేస్తున్నా అని విద్యాబాలన్‌ అన్నారు. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందట. తమిళ ప్రేక్షకులకు‌ తగ్గట్టు ఈ రీమేక్‌ స్క్రిప్టులో మార్పులు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!