సెన్సిబుల్ డైరెక్టర్ తో విజయ్!

పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండకు ఆ సినిమా హిట్ తో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటించిన ‘ద్వారక’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ‘అర్జున్ రెడ్డి’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇవే కాకుండా ఆయన చేతుల్లో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా విజయ్ మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సెన్సిబుల్ స్టోరీస్ ను తెరకెక్కించిన దర్శకుడు క్రాంతి మాధవ్ తో సినిమా చేయడానికి విజయ్ సిద్ధపడినట్లు సమాచారం. సినిమా కథ చాలా కొత్తగా ప్రేక్షకుల హృదయాలను మెప్పించే విధంగా ఉంటుందని టాక్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!