HomeTelugu Trendingగుజ‌రాతీ థాలి ప్లేట్ తో విజయ్‌ ఫొటో.. వైరల్‌

గుజ‌రాతీ థాలి ప్లేట్ తో విజయ్‌ ఫొటో.. వైరల్‌

Vijay devarakonda photo wit

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న తాజా చిత్రం ‘లైగ‌ర్’. పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ క్రమమంలో.. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్రంలో జ‌రిగిన సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న విజ‌య్‌… స్థానిక ఆహారం గుజ‌రాతీ థాలి ప్లేట్ ముందు కూర్చుని దానిని ఆర‌గించేందుకు రెడీ అవుతున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో దర్శనమిస్తుంది. ఈ ఫొటోను విజ‌య్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

గుజ‌రాతీ స్థానిక వంట‌కాల‌తో కూడిన స‌ద‌రు ప్లేట్‌లో ప‌లు ర‌కాల వంట‌కాల‌ను పెద్ద ప్లేట్‌లో అమ‌ర్చారు. ఆ ప్లేట్‌లోని ఆహార ప‌దార్థాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ విజ‌య్ కూర్చుని ఉన్నాడు. ఈ ఫొటోపై కామెంట్లు చేస్తూ పెద్ద సంఖ్య‌లో నెటిజ‌న్లు ఆ ఫొటోను వైర‌ల్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!