బాలీవుడ్ ఛాన్స్ కు నో!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ ని కూడా ఆకర్షించాడు విజయ్ దేవరకొండ.  ఇక తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు దక్కించుకున్న విజయ్ దేవరకొండ త్వరలో కోలీవుడ్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ‘అర్జున్ రెడ్డి’  సినిమాతో ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో హిందీ నుంచి విజయ్ దేవరకొండకు భారీ ఆఫర్ వచ్చిందట.

బాలీవుడ్లో భారీ సంస్థగా చెప్పుకునే యష్ రాజ్ ఫిలిమ్స్ వారు, విజయ్ దేవరకొండతో వరుసగా 3 సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ ఆఫర్ ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్టుగా సమాచారం. అయితే దీనికి కారణం డీల్ ఓకే అంటే ఆ మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో సినిమా చేయడానికి ఉండదట. అందువలన ఈ డీల్ విషయంలో విజయ్ దేవరకొండ ఆసక్తిని చూపించలేదని తెలుస్తోంది.