డైరెక్టర్ గా సినిమా చేయబోతున్నా!

దలపతి, రోజా, మెరుపుకలలు వంటి చిత్రాల్లో నటించిన అరవింద్ స్వామి రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. తని ఒరువన్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. రీసెంట్ గా అదే సినిమా ‘దృవ’ రీమేక్ లో నటించి తెలుగు స్క్రీన్ పై మరోసారి మెరిశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన అరవింద్ స్వామి త్వరలోనే ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించారు.

నటించడం కంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అంటే ఇష్టమని తాను డైరెక్టర్ కావడానికి రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అయితే ఏ కథతో సినిమా చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన నటనను కంటిన్యూ చేస్తూనే సినిమాను కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించిన అరవింద్ స్వామి ఆయన డైరెక్ట్ చేసే సినిమాలో మాత్రం నటించనని చెప్పారు.

ప్రస్తుతం ఆయన బోగన్, చదరంగ వేట్టై సినిమాల్లో నటిస్తున్నారు. అలానే భాస్కర్ ది రాస్కెల్ సినిమా తమిళ రీమేక్ లో నటిస్తున్నారు.