HomeTelugu Trendingకాలు జారి పడబోయిన విజయ్‌ దేవరకొండ.. వీడియో వైరల్‌

కాలు జారి పడబోయిన విజయ్‌ దేవరకొండ.. వీడియో వైరల్‌

2 4
టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ.. బాలీవుడ్‌ భామ అనన్య పాండేలు జంటగా నటిస్తున్న సినిమా ‘ఫైటర్‌’. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటోంది. ఇటీవల వీరిద్దరూ ముంబై వీధుల్లో బైక్‌పై చక్కర్లు కొడుతూ రైడ్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌కి సంబంధించిన మరో వీడియో సోషల్‌ వీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక విజయ్‌ షూటింగ్‌ స్పాట్‌కు కొంత మందితో నడుచుకుంటూ వస్తుండగా ఆకస్మాత్తుగా కాలు జారి పడపోబోయాడు. దాదాపు కింద పడిపోతున్న సమయంలో తన చుట్టూ ఉన్న వారు విజయ్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!