HomeTelugu Trendingఇదంతా అనవసరం కదా.. రష్మిక బ్రేకప్‌పై విజయ్‌ దేవరకొండ రియాక్షన్‌

ఇదంతా అనవసరం కదా.. రష్మిక బ్రేకప్‌పై విజయ్‌ దేవరకొండ రియాక్షన్‌

6 14హీరోయిన్‌ రష్మిక మందన్నా కన్నడ నటుడు రక్షిత్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్‌లో ఏర్పడ్డ వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలను ఒప్పించి, నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తమ ప్రేమకు స్వస్తి పలికినట్లు వీరు ప్రకటించారు. ఇప్పుడు ఇద్దరు కెరీర్‌లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఇదంతా జరిగి దాదాపు ఏడాది కావొస్తున్నా ఇంకా రక్షిత్‌తో బ్రేకప్‌ గురించి రష్మికను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎందుకు విడిపోయారని, కారణాలు చెప్పమని అడుగుతున్నారు. కాగా ఈసారి బ్రేకప్‌ గురించి రష్మికను మీడియా ప్రశ్నించగా.. పక్కనే ఉన్న విజయ్‌ దేవరకొండ స్పందించారు. ‘నీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఒకరి వ్యక్తిగత జీవితంతో మరొకరికి అవసరం లేదు. మీరు అడగడం.. మేం చెప్పడం.. ఇదంతా అనవసరం కదా. ఇది మన పనికాదు’ అని విజయ్‌ అన్నారు. అనంతరం రష్మిక కల్పించుకుంటూ.. ‘ఇది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్న ప్రశ్నే.. నాకే అర్థం చేసుకోవడం రావడం లేదు. అందుకే జవాబు చెప్పలేకపోతున్నా’ అని కామెంట్‌ చేశారు.

‘గీత గోవిందం’ తర్వాత రష్మిక, విజయ్‌ జంటగా ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా తెరకెక్కుతోంది. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు నాలుగు భాషల్లోనూ ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. ఈ నెల 26న చిత్రం విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!