విజయ్‌ సేతుపతి కూతురికి అత్యాచార బెదిరింపులు

స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ప్రముఖ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తన బయోపిక్ విషయంలో వివాదాలు రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్‌ సేతుపతికి మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముత్తయ్య ఓ లేఖ విడుదల చేశారు. విజయ్ సేతుపతి మంచి నటుడని, కేవలం తన సినిమా వల్ల ఆయనకు ఇబ్బంది కలగకూడదని భావించి ఆయనను తప్పుకోవాలని కోరినట్లు మురళీధరన్ తెలిపారు. దీనిపై స్పందించిన విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ట్విటర్‌లో ‘ధన్యవాదాలు.. ఇక సెలవు’ అని ట్వీట్ చేశారు.

ఈ సినిమా నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్న కొన్ని గంటలకే కొందరు నెటిజన్లు అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన చిన్న కూమార్తెను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థం అవుతుందని అని పేర్కొన్నారు. అయితే ఈ ట్రోల్‌పై అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవ్వడంతో సదరు నెటిజన్‌ ప్రవర్తనను ఖండిస్తున్నారు. సింగర్‌ చిన్మయి కూడా ఈ ట్వీట్స్‌పై స్పందించారు. ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు, దీనిని ఎవరూ మార్చలేరు?. అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెప్తున్న వ్యక్తి నేరస్థుడు. ఇంత జరుగుతున్న చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు’ అంటూ మండిపడ్డారు. అలాటే అడయార్‌ డిప్యూటీ కమిషనర్‌, చెన్నై పోలీసులను ట్యాగ్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates