వేలానికి తమిళ హీరో విజయకాంత్ ఆస్తులు

ఒకప్పటి తమిళ స్టార్ హీరో, డిఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ ఆస్తులు వేలానికి వెళ్లాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద తీసుకున్న రుణం కట్టని కారణంగా సాలిగ్రామంలో ఉన్న విజయకాంత్ నివాసాన్ని, తేని జాతీయ రహదారిలో ఉన్న ఆయనకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలను ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ వేలం జూలై 26న జరగనుంది. 2004 తరవాత సినిమాలకు దూరంగా విజయకాంత్ ఆనారోగ్యం కారణంగా రాజకీయ కార్యకలాపాలకు కూడా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు షణ్ముగ పాండియన్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు.