HomeTelugu Trendingహిందీ 'ఛత్రపతి'ని డైరెక్ట్‌ చేయనున్న వినాయక్‌

హిందీ ‘ఛత్రపతి’ని డైరెక్ట్‌ చేయనున్న వినాయక్‌

VV Vinayak to remake Chhatr
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘ఛత్రపతి’. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతోంది. హిందీలో డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

కాగా సాయి శ్రీనివాస్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ‘అల్లుడు శీను’ సినిమాకి దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను రూపొందించనున్నారు. ఈ ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కావడం విశేషం. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతిలాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాతృకకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ ఆడియెన్స్ ను ఆక‌ట్టుకునేలా స్క్రిప్ట్ వ‌ర్క్ ను మారుస్తున్నార‌ట. ప్ర‌ధానంగా సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాల్లో మార్పులు చేయ‌నున్న‌ట్టు వినికిడి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu