
High Bets on War 2 Telugu Rights
బాలీవుడ్ బడ్జెట్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నప్పుడు పెద్దగా హడావుడి ఉండదు. అయినా అవి స్టాండర్డ్ రేట్లకే స్థానిక డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తుంటారు. కానీ సౌత్ స్టార్ ఎవరైనా ఉండగానే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అదే ఇప్పుడు వార్ 2 సినిమాకి జరుగుతోంది.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్‌కి డెడికేటెడ్ ఫైట్స్, సాంగ్స్, డాన్స్‌లు ఉండబోతున్నాయని సమాచారం. అందుకే తెలుగులో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఇది చూసి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని తెలుగు రైట్స్ కొనాలనే ఉత్సాహంతో పోటీకి దిగుతున్నారు. ప్రత్యేకంగా నిర్మాత నాగవంశీ — ఎన్టీఆర్‌కు క్లోజ్‌గా ఉండటంతో, ఈ డీల్లో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే ‘దేవర’ రిలీజ్‌కి కూడా ఎన్టీఆర్ పూర్తిగా మద్దతిచ్చిన నేపథ్యంలో, ఈ డీల్‌ను సెట్ చేయడంలో ఎన్టీఆర్ సహకారం ఉందని టాక్.
ఇదే సమయంలో ఆసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ కూడా పోటీకి దిగారు. మార్కెట్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రైట్స్ రూ.120 కోట్లు దాకా వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇంత రేటు తెలుగులో ఒక డబ్‌డ్ హిందీ సినిమాకు అవసరమా? అన్న డిబేట్ కూడా నడుస్తోంది.
‘దేవర’ లాంటి నేటివ్ తెలుగు సినిమా కూడా రూ.120 కోట్ల రేంజ్‌లో అమ్ముడైందంటే, ‘వార్ 2’ వంటి డబ్‌డ్ మూవీకీ అంతే రేటు న్యాయమైనదా? అన్నదే సందేహం. హృతిక్ కూడా సినిమాలో హీరోనే అయినా, ఎన్టీఆర్ ప్రభావం తెలుగులో ఓపెనింగ్స్‌కి పుష్ ఇస్తుందనే నమ్మకం మాత్రం ఉంది.
ఫైనల్‌గా ఈ డీల్ మరో రెండు రోజుల్లో క్లోజ్ అయ్యే ఛాన్సుంది. కానీ ఏ బ్యానర్ ఈ భారీ బిల్లును భరిస్తుందో చూడాలి!
ALSO READ: Robinhood OTT release ఎప్పుడు ఏ ప్లాట్ ఫామ్ లో అంటే..













