పాకిస్థానీ టీ యాడ్ లో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్? మీరే చూడండి

భారతీయ వాయుసేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫిబ్రవరి 27న పాకిస్థాన్ కు బందీగా చిక్కి మార్చి 1న విడుదలైయ్యాడు. కాగా ఇప్పుడు ఒక పాకిస్థానీ టీ వ్యాపార ప్రకటన స్పూఫ్ లో కనిపిస్తున్నారు వర్థమాన్. తమ అధీనంలో ఉండగా పాకిస్థాన్ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అభినందన్ కప్పు టీ తాగుతూ ఫెంటాస్టిక్ అని చెబుతూ కనిపించారు.

ఆ ఫుటేజీని వాడుకుంటూ ఇప్పుడు కరాచీలో తయారయ్యే తపాల్ దానేదార్ అనే టీ బ్రాండ్ పాత వ్యాపార ప్రకటనను సరికొత్తగా తయారు చేశారు. పాత ప్రకటనలో ఒక నడివయసు మహిళ తమ ఎదురు బాల్కనీలో నిలబడి యువ జంట టీ తాగడాన్ని చూస్తూ ఉంటుంది.

కొత్త స్పూఫ్ లో యువజంట స్థానంలో అభినందన్ వర్థమాన్ ను పెట్టారు. దీంతో ఈ టీ బ్రాండ్ పేరు ట్విట్టర్ లో మార్మోగిపోతోంది. మొదటిసారి చూసిన చాలామంది అది నిజమేమో అని పొరబడ్డారు.

పాత వ్యాపార ప్రకటనకు సరికొత్త హంగులు దిద్ది ఎవరు తయారుచేశారో ఇంకా తెలియడం లేదు.