HomeTelugu Trendingఈ సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదు: శర్వానంద్‌

ఈ సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదు: శర్వానంద్‌

9 12యంగ్‌ హీరో శర్వానంద్‌ ‘రణరంగం’ సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదని చెప్పారు. ఆయన నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌ హీరోయిన్‌లుగా నటించారు. శుక్రవారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శర్వా మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమా ఇదని ఆనందం వ్యక్తం చేశారు.

‘నాకు మంచి ఓపెనింగ్స్‌ తీసుకొచ్చిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. రివ్యూల్లో రాసిన విధానం, నాకు వచ్చిన స్పందన ప్రకారం.. కథ గురించి ఓసారి ఆలోచించి ఉండాలని మీరు (విమర్శకుల్ని ఉద్దేశిస్తూ) అనుకున్నారు. కానీ స్క్రీన్‌ప్లేపై ఆధారపడి ఈ సినిమా తీశాం. ఓ సందేశం ఇవ్వాలని మేం అనుకోలేదు. ఓ స్టైలిష్ యాక్షన్‌ సినిమా తీద్దాం అనుకున్నాం. ఆ విషయంలో మేం 200 శాతం సక్సెస్‌ అయ్యాం. దీని కోసం చాలా మంది కష్టపడ్డారు. మా సినిమాటోగ్రాఫర్‌ దివాకర్‌ ది బెస్ట్‌ ఇచ్చారు. కళా దర్శకుడు రవీంద్ర, ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ పనితీరు అద్భుతం. నటీనటులు రాజా, ఆదర్శ్‌, సుదర్శన్‌ తదితరులు బాగా నటించారు. వారికి మంచి పేరు వచ్చింది’.

గత ప్రెస్‌మీట్‌లో కాజల్‌ గురించి మాట్లాడలేదు. కాజల్‌ ఈ సినిమాలో నటించినందుకు ధన్యవాదాలు. తనది చిన్న పాత్ర అయినా చేశారు. తన పాత్ర నిడివి ఇంకా చాలా ఉంది. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో కట్‌ చేశారు. కల్యాణితో నా ప్రేమకథ అందరికీ నచ్చింది. నేను ఇప్పటి వరకూ ఇలాంటి ప్రేమకథలో నటించలేదు. నిన్న మార్నింగ్‌ షో సమయంలో చిత్ర బృందం అంతా చాలా టెన్షన్‌ పడుతూ ఉన్నాం. మధ్యాహ్నం షో నుంచి మంచి టాక్‌ వచ్చింది’ అని శర్వా చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!