Homeపొలిటికల్ఏమయ్యా ధర్మానం నీ అధర్మాలు మర్చితే ఎలా ?

ఏమయ్యా ధర్మానం నీ అధర్మాలు మర్చితే ఎలా ?

Dharmana Prasada Rao

సీనియర్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావుకి ఘనమైన గతం ఉంది. కానీ, ఎన్నడూ ప్రజలను ఉద్ధరించినట్టు ఒక్క సంఘటన కూడా లేదు. ఐతే, తన మీద అవినీతిపరుడు అని ముద్ర వేయడానికి కొన్ని టీవీ చానళ్లు తెగ కష్టపడిపోతున్నాయి అని మంత్రిగారు తాజాగా కుండబద్ధలు కొట్టారు. కానీ, ఆ కుండలో కూడా అవినీతి కంపే కొడుతోంది. ధర్మాన ప్రసాదరావు అధర్మ ప్రసాదరావుగా మారిపోయాడు అంటూ ఆయన గత సన్నిహితులే పెదవి దాటుతున్నారు. పైగా పైకి మాత్రం తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను అంటూ ధర్మానం పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు.

మరీ ఇదే ధర్మానం గోరి మీద వచ్చిన అభియోగాల మాటేమిటి ?, ఈయనగారు అవినీతి పనులు చేశారు అని సొంత పార్టీ వాళ్లే లీకులు ఇచ్చిన సంగతులు ధర్మాన మర్చిపోతే ఎలా ?. ఆ వచ్చిన లీకుల గురించి చెప్పిన పాపానికి టీవీ చానళ్ళు వచ్చి సంజాయిషీ ఇచ్చుకోవాలా ?. అసలు తన పై ఆరోపణలు మాత్రమే వస్తే.. వాటిని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటూ ధర్మాన టీవీ చానళ్ళను తిట్టి పోయడం నిజంగా విచిత్రమే. పైగా తన పై వచ్చే ఆరోపణలను ఏ ఒక్కరూ నమ్మకూడదు అట.

కానీ.. ఈయన గారు అమరావతిలో టీడీపీ ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిందని అభియోగం మోపితే.. అందరూ వహ్వా.. వహ్వా అంటూ క్లాప్స్ కొట్టాలి. ధర్మాన చెప్పిన సొల్లు మాటలు పట్టుకుని అందరూ పోయి చంద్రబాబుని ప్రశ్నించాలి. అవసరం అయితే, కఠినంగా శిక్షించాలి. ఏమిటి జస్ట్ ఆరోపణలకే. కానీ, అవే ఆరోపణలు ధర్మాన మీద వస్తే అస్సలు నమ్మకూడదు. పైగా ఈయన గారి మీద ఎవ్వరూ ఏ కామెంట్ చేయకూడదు. తన పై నెగిటివ్ మాట్లాడే వాళ్లంతా నీచులు అంటున్నాడు ధర్మాన. తన పై బురద జల్లుతున్నారు అని ధర్మాన తెగ ఇదైపోతున్నాడు.

మరి గతంలో ఇదే ధర్మాన ప్రసాదరావు ఎన్నో ఆరోపణలు చేశాడు, చంద్రబాబు పై చాలా నీచంగా బురదజల్లే ప్రయత్నం చేశాడు. వాటిల్లో కొన్ని చూద్దాం.

చంద్రబాబు పింక్ డైమండ్ కొట్టేశాడని ప్రచారం చేయడం .. బురద జల్లుడు కాదా ధర్మానం ?

చంద్రబాబు 6 లక్షల కోట్లు దోచేసుకున్నాడని పుస్తకం రాస్తే దాన్ని ప్రచారం చేయడం.. బురద జల్లుడు కాదా ధర్మానం ?

జగన్ బాబాయ్ ని చంద్రబాబే చంపాడని సాక్షి లో రాస్తే.. దాన్ని చదివి వినిపించడం.. బురద జల్లుడు కాదా ధర్మానం ?

36 కమ్మ డీఎస్పీ లకు ప్రమోషన్స్ ఇచ్చారని రాస్తే, అవును నిజమే అంటూ నువ్వు తీర్మానం చేయడం.. బురద జల్లుడు కాదా ధర్మానం ?

అమరావతిని కమరావతి గా ప్రచారం చేయడం… బురద జల్లుడు కాదా ధర్మానం ?

అమరావతి రైతులను రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అనడం.. బురద జల్లుడు కాదా ధర్మానం ?

హలో ధర్మానం.. మీరు చేసుకున్న ఖర్మ కచ్చితంగా ఏదో ఒకరోజు మీ మెడకే చుట్టుకుంటోంది. గుర్తు పెట్టుకోండి. అయినా ధర్మాన ఎంత ధర్మాత్ముడో అందరికీ తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu