HomeTelugu Trending'ఎన్‌బీకే 108'లో శ్రీలీల బాలకృష్ణ కూతురు కాదంట!

‘ఎన్‌బీకే 108’లో శ్రీలీల బాలకృష్ణ కూతురు కాదంట!

what is the role of sreelee
నంద‌మూరి బాల‌కృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎన్‌బీకే 108’. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన స్టిల్స్ సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న లుక్స్‌లో కనిపించబోతున్నట్టు హింట్‌ ఇచ్చేశాడు డైరెక్టర్‌.

మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఎన్‌బీకే 108లో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీలీల ఇందులో బాలయ్య కూతురుగా కనిపించబోతున్నట్టు ఇప్పటిదాకా వార్తలు హల్‌ చల్ చేస్తున్నాయి. కాగా దీనికి సంబంధించి మరో వార్త తెరపైకి వచ్చింది.

శ్రీలీల ఈ మూవీలో బాలకృష్ణ స్నేహితుడి కూతురుగా కనిపించనుందట. ఇంతకీ బాలకృష్ణ స్నేహితుడెవరనే కదా మీ డౌటు.. స్టార్ యాక్టర్ శరత్‌కుమార్‌. అంతేకాదు సినిమాలో ఓ ట్విస్ట్‌ ఉండబోతుండగా.. బాలకృష్ణ, శ్రీలీల మధ్య బాండింగ్‌ స్టోరీలో చాలా కీలకంగా సాగునుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇప్పటివరకు రాయలసీయ యాసలో అలరించిన బాలకృష్ణ.. ఈ సారి మాత్రం పక్కా తెలంగాణ యాసలో ఎంటర్‌టైన్‌ చేయనున్నాడు.

ఈ మూవీని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత ఎస్‌ థమన్‌ మరోసారి అదిరిపోయే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం ఎన్‌బీకే 108 షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో కొనసాగుతోంది.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!