ఈవారం బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేషన్ ఎవరు?

తెలుగు బిగ్ బాస్-3 చివరి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్ లో మిగిలి ఉన్న వారందరూ బలమైన కంటెస్టెంట్లే.. ఈ వారం కూడా హౌస్ లోనే అత్యంత బలమైన పోటీదారులైన వరుణ్ సందేశ్ – రాహుల్ సిప్లిగంజ్ – మహేష్ విట్టాలు ఎలిమినేషన్ లో ఉన్నారు. వితికా కూడా నామినేట్ అయినా తన దగ్గరున్నమెడాలియన్ తో ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. ఈ ముగ్గురిలో ఈ వారం ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకుల్లో ఉత్కంఠ ఉంది. అయితే ఈ వారం మహేష్ విట్టా ఎలిమినేట్ కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మహేష్ విట్టా ఫస్ట్ నుంచి బలమైన పోటీదారుగా ఉన్నాడు. 12వ వారం వరకూ ఉద్దండులైన వారిని ఇంటికి పంపించి హౌస్‌లో నిలిచాడు. సామాన్యుడి పేదరికపు చాయలు ఉండడం.. అచ్చ పల్లెటూరి పిల్లగాడులా ఆకట్టుకుంటూ బిగ్ బాస్ లో ఇంతకాలం జర్నీ చేశాడు. ఈ వారం మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వరుణ్, రాహుల్ మధ్య మహేష్ విట్టానే ఎలిమినేట్ కాబోతున్నట్లు అనిపిస్తోంది. బిగ్‌బాస్‌లో ఏమైనా జరగొచ్చు.

CLICK HERE!! For the aha Latest Updates