సమంత కొడుకుగా స్టార్‌ హీరో కుమారుడు!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి పీరియాడికల్‌ చిత్రం ‘శాకుంతలం’. దుష్యంతుడు- శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత , దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం సమంత నాలుగు నెలలపాటు క్లాసికల్‌ డ్యాన్సులు కూడా నేర్చుకుందట. ఇదిలా వుంటే శాకుంతలంలో సమంత కొడుకు పాత్రలో ఎవరు నటించనున్నారు? అనే ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

శాకుంతలం కొడుకు భరత్‌ పాత్ర కోసం టాలీవుడ్‌ స్టార్‌ హీరోల కొడుకులను సంప్రదిస్తున్నారట. జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌లలో ఎవరో ఒకరిని శాకుంతలం సినిమాకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ముందుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఈ విషయమై సంప్రదించనున్నాడట గుణశేఖర్‌. మరి ఈ చర్చలు ఎంతవరకు వెళ్తాయి? సమంతకు కొడుకుగా ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! ఇదిలా వుంటే శాకుంతలం చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates