
Upcoming Tollywood Sequels:
బాహుబలి సక్సెస్ తర్వాత, టాలీవుడ్‌లో సీక్వెల్స్, థ్రీక్వెల్స్‌కు హవా మొదలైంది. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్స్ అన్నీ ఆలస్యంగా వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలే టైమ్‌కు రావడం లేదు!
టిల్లు క్యూబ్: సిద్దూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’తో హిట్స్ కొట్టాడు. కానీ ‘జాక్’ ఫ్లాప్‌తో షాక్ తగిలింది. ఇప్పుడు టిల్లు క్యూబ్ విషయంలో సిద్దూ జాగ్రత్త పడుతూ కథను బలంగా మలుచుకుంటున్నాడు.
బింబిసార 2: కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సూపర్ హిట్ అయ్యింది. కానీ దర్శకుడు వశిష్ఠ ఇప్పుడు చిరంజీవి ‘విశ్వంభర’లో బిజీగా ఉండటంతో సీక్వెల్ ఆలస్యం అవుతోంది.
దేవర 2: ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవరకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ ‘వార్ 2’, ‘డ్రాగన్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినా కొరటాల శివ మాత్రం మళ్లీ ఎలాంటి తప్పులూ జరగకూడదనే ఉద్దేశంతో కథను మెరుగుపరుస్తున్నాడు.
సలార్ 2: ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ హిట్ అయినా, ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. అందుకే సలార్ 2 ఆలస్యం అవుతోంది.
కల్కి 2898AD సీక్వెల్: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకి సీక్వెల్‌పై అంచనాలు ఉన్నా, ప్రభాస్ బిజీ ప్రాజెక్ట్స్ వల్ల అది కూడా పక్కన పడుతోంది.
పుష్ప 3: పుష్ప ది రైజ్, ది రూల్ తర్వాత దేశవ్యాప్తంగా పుష్ప 3 కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అల్లు అర్జున్ అతని తదుపరి సినిమాల తో, సుకుమార్ రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉండటంతో ఇది కూడా డిలే అవుతోంది.













