ఏ పనైనా మనస్ఫూర్తిగా చేస్తా: కీర్తి సురేష్


చాలా తక్కువ సమయంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తిసురేష్. మలయాళంలో తెరంగేట్రం చేసినా టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో కీర్తిసురేష్ నటించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. అంతేకాదు చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ చిత్రాల్లో హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కీర్తిసురేష్ ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాను ధరించిన దుస్తులు అందంగా ఉంటున్నాయి అంటోందీ భామ. అందుకు కారణం ఫ్యాషన్ డిజైనింగ్‌పై తనకున్న ఆసక్తి కారణమంటోంది. ఎవరు ఏ వృత్తిని చేసినా మనస్ఫూర్తిగా ప్రేమించి చేస్తే ఫలం, ఆనందం లభిస్తాయి. పనిని సంతోషంగా చేస్తే విజయాన్ని సాధించినట్లే. ప్రతిఒక్కరూ వారికి ఇష్టమైన వృత్తిని ఎంచుకోవాలి.

కథానాయకి ప్రాముఖ్యత కలిగిన పాత్రలను సమర్థవంతంగా చేయగలననే పేరు పొందాను. ఇది సంతోషాన్నిస్తోంది. నేను ఎంపిక చేసుకునే చిత్రాల్లో ఎవరెవరు పనిచేస్తున్నారు? కథేంటి? నా పాత్ర ఏమిటి? అనే విషయాల గురించి తెలుసుకున్న తర్వాతే అందులో నటించడానికి అంగీకరిస్తున్నాను. సినిమా కోసం సమష్టిగా శ్రమిస్తేనే విజయం పొందగలం. అందరూ ఒకే భావనతో పనిచేస్తేనే జయించగలం. నాలోని ప్రతిభను నిరూపించుకునే కథా పాత్రలను కోరుకుని నటిస్తున్నాను. అలాంటి పాత్రలనే ఆశిస్తున్నానంటోంది కీర్తి సురేష్. ప్రస్తుతం తమిళంలో పెన్‌గ్విన్‌ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. త్వరలో రజనీకాంత్‌తో కలిసి నటించనున్నట్లు సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates