‘ఆక్సిజన్’ వర్కవుట్ అవుతుందా..?

చాలా కాలంగా నిర్మాత ఏఎమ్ రత్నంకు సరైన హిట్టు సినిమా పడలేదు. రీసెంట్ గా ఆయన నిర్మించిన ‘ఆక్సిజన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. గోపిచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొని ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. ప్రచార చిత్రాలను చూస్తుంటే సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లుగా అనిపిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాకు తీసుకునే విధంగా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో ఈ సినిమా చేశారు.

భారీ స్టార్ కాస్ట్ ను కూడా తీసుకున్నారు. జగపతిబాబు, శరత్ కుమార్ ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. ప్రస్తుతం గోపీచంద్ కు ఎలాంటి హిట్లు లేవు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గౌతమ్ నందా’ కూడా తేలిపోయింది. ఈ క్రమంలో సినిమాపై ఎలాంటి బాజ్ లేకుండా పోయింది. ట్రైలర్ కూడా సినిమాపై ఎలాంటి ఆసక్తిని కలిగించలేకపోయింది.

కానీ దర్శకుడు జ్యోతికృష్ణ మాత్రం సినిమాపై చాలా నమ్మకంగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆడియన్స్ ను మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి సినిమా ఎనతవరకు వర్కవుట్ అవుతుందో.. చూడాలి!