విన్నర్ సెన్సార్ పూర్తి!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘విన్నర్’. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఏ సర్టిఫికెట్ పొందడం విశేషం. ఇప్పటికే చిత్ర ట్రైలర్ కు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సైతం చిత్ర యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తడం మరో విశేషం. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… మేమంతా ఊహించినట్టుగానే ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయింది. యు బై ఏ సర్టిఫికెట్ పొందిన విన్నర్ కు సెన్సార్ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. అని అన్నారు.