మ‌హా శివ‌రాత్రి కానుకగా ‘య‌మ‌న్‌’!

విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘యమన్‌స‌. ఈ సినిమా మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న గ్రాండ్‌రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా…
నిర్మాత మిర్యాల రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ”బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోనిగారు హీరోగా నటించిన మరో మంచి చిత్రం ‘యమన్‌’. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోనూ ఇదో డిఫరెంట్‌ మూవీ అని చెప్పొచ్చు. కంప్లీట్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమా. ఇంతకుముందు సినిమాల్లో హీరోయిన్‌తో రొమాన్స్‌, సాంగ్స్‌ ఎక్కువగా లేవు. ఈ సినిమాలో మాత్రం రొమాన్స్‌, సాంగ్స్‌ వుంటాయి. అల్రెడి విడుద‌లైన ఈ సినిమా పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఒక పాట హీరోయిన్‌పై, మరో పాట లుంగి డాన్స్‌ టైప్‌లో, హీరో, హీరోయిన్‌పై ఒక సాంగ్ స‌హా మరో రెండు పాటలు స్టోరీతో వెళ్ళే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్స్ అన్నీ ఆడియెన్స్‌ను అల‌రిస్తున్నాయి. ఈ పాటల్ని ఆల్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాకి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చి పెద్ద హిట్‌ అవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న మహాశివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నాం. గత సంవత్సరం బిచ్చగాడు రిలీజ్‌ అయిన టైమ్‌లోనే ఈ చిత్రాన్ని కూడా మహాశివరాత్రి కానుకగా ఫిబ్ర‌వ‌రి 24న‌ రిలీజ్‌ చేస్తున్నాం. క‌చ్ఛితంగా ఈ సినిమా బిచ్చగాడు కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుంది” అన్నారు. 
హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ.. ”ఈ సినిమాకు క‌థే హీరో. క‌థ విన‌గానే ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. జీవ శంక‌ర్ సినిమాను ఎంతో చ‌క్క‌గా డీల్ చేశారు. ఇది అంద‌రికీ న‌చ్చే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. న‌టుడుగా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నాకెంతో మంచి పేరు తెస్తుంది. తెలుగులో నేను చేసిన బిచ్చ‌గాడు కంటే పెద్ద హిట్ మూవీగా నిలుస్తుంది. సినిమాను ఫిబ్ర‌వ‌రి 24న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.