HomeTelugu Big Storiesయశోద: మేకింగ్ వీడియో వైరల్‌

యశోద: మేకింగ్ వీడియో వైరల్‌

Yashoda Action Thrills
స్టార్ హీరోయిన్ స‌మంత నటిస్తున్న చిత్రం ‘యశోద’. హరి-హరీష్‌ డైరెక్షన్‌లో ఇప్పటికే విడుదలైన యశోద ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో సమంత యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి. పాపులర్‌ హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రఫర్‌‌, యాక్షన్‌ డైరెక్టర్‌ యానిక్‌ బెన్‌ యశోదలో యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశాడు. యశోద టీం యాక్షన్‌ సన్నివేశాల మేకింగ్ వీడియో ఒకటి మేకర్స్ షేర్ చేసుకున్నారు. యశోద యాక్షన్‌ పార్ట్‌ మేకింగ్‌ విశేషాలను యానిక్‌ బెన్‌ మూవీ లవర్స్‌ తో షేర్ చేసుకున్నాడు.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న యశోదను శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న యశోద చిత్రంలో రావు రమేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!