విలన్ పాత్రలో యాత్ర హీరో..!


వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇదిలా ఉంటె, తమిళంలో జయం రవి నటించిన తని ఒరువన్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేయబోతున్న సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది. జయం రవి హీరో కాగా, మొదటి పార్ట్ లో విలన్ గా చేసిన అరవింద స్వామీ ప్లేస్ లో ఎవర్ని తీసుకోవాలనే ఆలోచనలో పడింది యూనిట్. అరవింద స్వామీని తలపించే విధంగా ఉండాలన్నది యూనిట్ తాపత్రయం. అందుకే మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టిని కలిసి కథను వినిపించేందుకు సిద్దమౌతున్నది యూనిట్. మరి మమ్ముట్టి విలన్ రోల్ లో నటించేందుకు అంగీకరిస్తారా లేదా అన్నది తెలియాలి.