యాత్ర ‘టీజర్‌’ నేనున్నాను అంటూ.. రాజన్న భరోసా..!!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. మహి వి.రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించారు. ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. ‘నీరుంటే కరెంట్‌ ఉండదు. కరెంట్‌ ఉంటే నీరుండదు. రెండూ ఉండి పంట చేతికొస్తే సరైన ధర ఉండదు’ అంటూ ఓ రైతు తన బాధను వివరిస్తున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది.

రైతుల కష్టాలను తీర్చేందుకు మమ్ముట్టి‌(వైఎస్సార్‌) పాదయాత్ర చేస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఓ రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే అతడి పక్కన కూర్చుని ‘నేను విన్నాను.. నేనున్నాను’ అని మమ్ముట్టి ధైర్యం చెప్పడం బాగుంది. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చల్లా, శశి దేవ్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, అనసూయ, వినోద్‌ కుమార్‌, సచిన్‌ ఖెడేకర్‌ తదితరులు సహాయ పాత్రలు పోషించారు. 2019 ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.