HomeTelugu Trendingపెళ్లి చేసుకున్న ప్రముఖ హాస్యనటుడు

పెళ్లి చేసుకున్న ప్రముఖ హాస్యనటుడు

1 4
తమిళ ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు పెళ్లి చేసుకున్నారు. ఈరోజు (బుధవారం0 ఉదయం మంజు భార్గవితో తిరుత్తణిలోని మురుగన్‌ ఆలయంలో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే సినీ పరిశ్రమలోని తన సన్నిహితుల కోసం యోగి త్వరలోనే చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కాగా, యోగి, భార్గవిలది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది.

యోగికి కమెడీయన్‌గా తమిళనాట విశేషమైన క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. మంచి కామెడీ టైమింగ్‌తో తనకంటూ స్పెషల్‌గా అభిమానులను ఏర్పరుచుకున్నారు. పలు డబ్బింగ్‌ సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu