
Vicky Kaushal Katrina Kaif House Rent:
విక్కీ కౌశల్ కెరీర్ ఇప్పుడు జోష్‌లో ఉంది! తాజాగా వచ్చిన ‘ఛావా’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. షంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ ఒదిగిపోయి నటించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లను దాటి గర్జించింది ఈ సినిమా.
పర్సనల్ లైఫ్‌లో కూడా విక్కీ, కట్రినా కలిసి పర్ఫెక్ట్ కపుల్‌గా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇద్దరి బాండింగ్, కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
జూహూలో రిచ్ లైఫ్ స్టైల్
తాజాగా ఈ జంట ముంబయిలోని జూహూలో ఉన్న తమ లగ్జరీ అపార్ట్మెంట్ లీజ్‌ను రీన్యూవ్ చేసుకున్నారు. ఈ అపార్ట్మెంట్ పేరు “రాజ్ మహల్” – పేరు వింటేనే రాయల ఆస్థానంలా ఉంది కదా! 2,781 చ.అ. విస్తీర్ణంతో, మూడు కార్ పార్కింగ్‌లు ఉండే ఈ ఇంటిలో వీరు ప్రశాంతమైన క్షణాలు గడుపుతుంటారు.
View this post on Instagram
అద్దె మొత్తం వింటే ఆశ్చర్యపోతారు
విక్కీ ఈ ఇంటికి మొదటి రెండు సంవత్సరాలకు నెలకు రూ.17.01 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మూడవ సంవత్సరంలో ఇది రూ.17.86 లక్షలకు పెరుగుతుంది. మొత్తం మూడు సంవత్సరాల అద్దె విలువ దాదాపు రూ.6.2 కోట్లు! అంతేకాదు, స్టాంప్ డ్యూటీకి రూ.1.69 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1,000, డిపాజిట్‌గా మాత్రం ఏకంగా రూ.1.75 కోట్లు ఇచ్చాడు! కొత్త లీజ్ 2025 ఏప్రిల్‌లో రిజిస్టర్ అయింది.
జూహూ అంటే సెలబ్రిటీలకు మోజు
జూహూ ముంబయిలోని ప్రీమియం ఏరియాల్లో ఒకటి. బీచ్, కాఫీ షాపులు, బిజినెస్ హబ్‌లకు దగ్గరగా ఉండటంతో ఫిల్మ్ స్టార్స్ ఇక్కడే ఎక్కువగా ఉంటారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, కార్తిక్ ఆర్యన్ వంటి స్టార్స్ కూడా ఇక్కడే నివసిస్తున్నారు.
ALSO READ: Megastar Chiranjeevi సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్.. ఎవరంటే!