చైతు యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు!

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘యుద్ధం శ‌ర‌ణం’. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.ఈ సంద‌ర్భంగా..
వారాహి చ‌ల‌న చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ”అక్కినేని నాగ‌చైత‌న్య న‌ట‌న‌లోని మ‌రో యాంగిల్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేస్తూ కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ యుద్ధం శ‌ర‌ణం. ఈ చిత్రం సెన్సార్ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను సెప్టెంబ‌ర్ 8న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్రేక్ష‌కులు, అక్కినేని అభిమానులను అల‌రించేలా యుద్ధం శ‌ర‌ణం సినిమా ఉంటుంది” అన్నారు.